రాష్ట్రంలోని ప్రతి రైతు అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. రాయలసీమ రైతుల అభివృద్ధి కోసం ముచ్చుమర్రి,అలగనూరు వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేసి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. నంద్యాల తెలుగు గంగ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఛాంబర్‌ను భూమా అఖిలప్రియ ప్రారంభించారు. తెలుగు గంగ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన సంజీవ కుమార్‌ను ఆమె అభినందించారు. ఆళ్లగడ్డ ప్రాంతంలో తెలుగు గంగ విస్తరణలో 60వేల ఎకరాల ఆయకట్టు భూమి ఉందన్నారు. ఆళ్లగడ్డలో కేసీ కెనాల్‌ను పూడ్చివేసి ఆ స్థలంలో వైసిపి నాయకులు వెంచర్లు వేశారని భూమా అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు.