అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చాలా రోజుల తర్వాత మళ్లీ పట్టణంలో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఆయన్ని అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు సిద్ధమయ్యారు. జేసీ ఇంటికి భారీగా టీడీపీ శ్రేణులు చేరుకున్నారు.. దీంతో పోలీసులు అలర్టయ్యారు. జేసీ ప్రభాకర్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఎస్పీ రోహిత్ కుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ తరుణంలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తాడిపత్రికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు. అటు కేతిరెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.