- ‘యువశక్తి’ పేరిట ఏపీలో జనసేన బహిరంగ సభలు
- పోస్టర్‌ను ఆవిష్కరించిన జనసేనాని పవన్ కల్యాణ్
జనవరి 12న శ్రీకాకుళంలో మొదటి’యువశక్తి’ సభ
హైదరాబాద్: జనసేన పార్టీ ఏపీలో కొత్త కార్యాచరణకు రూపకల్పన చేసింది. కౌలురైతు భరోసా, జనవాణి కార్యక్రమాలు విజయవంతం కావడంతో.. ఊపుమీదున్న జనసేన తాజాగా ‘యువశక్తి’ పేరిట ఏపీలో బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమైంది. మొదటి సభ జనవరి 12న శ్రీకాకుళంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ మేరకు యువశక్తి పోస్టరును పవన్ కల్యాణ్ సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. సభలో యువత సమస్యలపై చర్చిస్తామని పవన్ తెలిపారు.