స్వతంత్ర, వెబ్ డెస్క్: ఉద్యోగుల సమస్యలన్నింటినీ అవకాశం ఉన్నంత వరకు పరిష్కరిస్తామని చెప్పామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కొంత జాప్యం అయిందని తెలిపారు. 2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై జనవరిలో ఉత్తర్వులు ఇస్తామన్నారు. గురుకులాల్లో.. యూనివర్శిటీల్లోని ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయంలో పాజిటీవ్ నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై కెబినెట్ లో చర్చిస్తామన్నారు. స్పెషల్ పే ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. పీఈర్సీ, డీఏ బకాయిలను రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని చెప్పినా.. ఉద్యోగులు అంగీకరించ లేదని అన్నారు. ఈ బకాయిలను 16 విడతల్లో నాలుగేళ్లల్లో చెల్లింపులు జరపాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు అంశం కోర్టుల్లో ఉందని వివరించారు.