స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణాలో 97 శాతం భూ వివాదాలకు ధరణి కారణమైందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శుక్రవారం యూత్ కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో పలు అంశాలపై ఆయన చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఏవిదంగా పనిచేయాలి.. రాహుల్ ను ప్రధానిని చెయ్యడానికి ఏవిదంగా పనిచేయాలని చర్చించారు. క్షేత్ర స్థాయిలో కొట్లాడే యూత్ కాంగ్రెస్ నేతలు… ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారని సూచించారు. కేసీఆర్ లాంటి నియంతలు ఎదురించాలంటే యూత్ కాంగ్రెస్ కసి తో పనిచేయాలని అన్నారు.
గడీల పాలనను తిరిగి తీసుకరావడానికి ధరణి పోర్టల్ వచ్చిందని అన్నారు. తెలంగాణలో భూ పోరాటాలు బాగా జరిగాయి. అయినా కూడా దొరల కోసమే ధరణి తీసుకొచ్చారని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాలు కేసీఆర్ బినామీ పేర్లతో ఎక్కించుకున్నాడని ఆరోపించిన రేవంత్.. బరాబర్ ధరణి రద్దు చేస్తామని స్పష్టం చేశారు. గిరిజనుల్ని ఆదివాసులను భూమి లేని వారిని చేసిండ్రు.. అంతేకాకుండా ccl వద్ద, అధికారుల వద్ద ఉండాల్సిన సమాచారం పిలిపిన్స్ కంపెనీ చేతుల్లోకి పోయిందని మండిపడ్డారు.
ధరణి పోతే రైతు బంధు పడదా.. రైతులను ఎందుకు భయాందోళనకు గురిచేస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధరణి ఎత్తివేస్తాం.. అక్రమ భూముల కేటాయింపు కూడా ఎత్తివేస్తామన్నారు. రంగారెడ్డి, మేడ్చల్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ల అక్రమాలపై చర్యలు తీసుకుంటామన్నారు. ధరణి ని రద్దు చేసి.. తండ్రి కొడుకులను జైల్లో వేస్తామని మండిపడ్డారు. చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ కట్టించాలని ఎన్ఆర్ఐలు అంటున్నారని ఎద్దేవా చేశారు.


