లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీమంత్రి సోమిరెడ్డి తెలిపారు. తప్పు చేసిన ఏ ఒక్కరినీ ఆ దేవుడు వదిలిపెట్టడన్నారు. గత ప్రభుత్వ హయాంలో సర్వేపల్లిలో ఇసుక, గ్రావెల్ అక్రమాలు భారీగా జరిగాయని సోమిరెడ్డి ఆరోపించారు. కోట్ల రూపాయల అవినీతికి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు. రైతుల పేరుతో అనుమతులు తెచ్చి గ్రావెల్‌ని లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వేశారని మండిపడ్డారు. కాకాణి గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ అధికారులు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని సోమిరెడ్డి ప్రశ్నించారు.