అందెశ్రీ రాసిన పాటను తాము స్వాగతిస్తామని బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్య క్షుడు లక్ష్మణ్ అన్నారు. అందెశ్రీ రాసిన పాట ప్రజలందరికీ ప్రేరణ కలిగించిందని తెలిపారు. అందెశ్రీ రాసిన పాటను తాము స్వాగతి స్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ ప్రకటన వచ్చాక రాష్ట్ర చిహ్నం పై స్పందిస్తామని లక్ష్మణ్ అన్నారు. తెలంగా ణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్, కేటీఆర్ రాజ్యాంగ విలువలను కాలరాసి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.ఢిల్లీ పెద్దల అనుమతి కోసం ఎదురు చూస్తున్నారా అని లక్ష్మణ్ నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని చెప్పారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ఎందుకు మెతక వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.కాంగ్రెస్ పెద్దల ఒత్తిడితో కేసును నీరుగా ర్చవద్దు అని లక్ష్మణ్ కోరారు.


