అల్లు అర్జున్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీష్ రావు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఘటనకు అసలు కారకులు, రాష్ట్ర పాలకులే అన్నారు. బెనిఫిట్ ఫోలకు అనుమతి ఇచ్చింది ఎవరు అని నిలదీశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే అన్నారు. ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలని నిలదీశారు. అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలన్నారు హరీష్ రావు.