స్వతంత్ర వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో శుక్రవారం అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. అనంతరమే ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించిన సీఎం.. అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు మన ప్రభుత్వం సుప్రీంకోర్ట్ వరకూ వెళ్ళి పోరాడిందని పేర్కొన్నారు. నేడు అదే అమరావతిలో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు విలువ చేసే ఇళ్ళ స్థలాలకు 50,793 మంది అక్కాచెల్లెమ్మలను యజమానులను చేసింది మన ప్రభుత్వం అని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించే అవకాశాన్ని నాకు కల్పించిన దేవుడికి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.