స్వతంత్ర, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ లక్ష్యంగా దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. 60 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందన్నారు. అతి తక్కువ సమయంలో మొత్తం 21 మెడికల్ కాలేజీలు ప్రారంభించి తెలంగాణ దేశంలో రికార్డు సృష్టించింది అన్నారు. ఇటీవల ఏక కాలంలో 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియమించడం వల్ల టీచింగ్ ఆసుపత్రులు మరింత బలోపేతమై అయినట్లు చెప్పారు. సోమవారం టీచింగ్ ఆసుపత్రుల నెలవారీ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డిఎంఇ రమేష్ రెడ్డి, అరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందెందుకు, ప్రభుత్వం తరఫునుంచి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఘనంగా ప్రకారం మాతృ మరణాల రేటు రాష్ట్రంలో ఘనంగా తగ్గిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడినాడు 92 గా ఉంటే ఇప్పుడు 43 కు తగ్గించగలిగామని వెల్లడించారు. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. ఇవన్నీ మీరంతా చేస్తున్న కృషికి నిదర్శనం. అయితే దీంతో మనం సంతృప్తి చెందకుండా.. ఆరోగ్య రంగంలో తెలంగాణ నెంబర్.1 గా నిలవాలని ఆకాంక్షించారు.


