కాంగ్రెస్ ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. మార్పు కోసం రైతులు ఓటు వేశారన్నారు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసిందని అన్నారు. ఒక్క ఏడాదిలో 54 వేల కోట్లతో…రైతుల జీవితాల్లో పండగ తెచ్చామని చెప్పారు. ఇది నంబర్ కాదని.. రైతులు తమపై పెట్టుకున్న నమ్మకమన్నారు. అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలుపంచుకోవడానికి… ఉమ్మడి పాలమూరుకు వస్తున్నానంటూ సీఎం రేవంత్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.