స్వతంత్ర, వెబ్ డెస్క్: టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి దుర్మార్గమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వైసీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారన్న కక్షతోనే దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. జగన్ రెడ్డి అండతో రాష్ట్రంలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయని.. పట్టపగలు ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడడం జగన్ రెడ్డి రౌడీ పాలనకు నిదర్శనమని తెలిపారు. ఇలాంటి దాడులతో మమ్మల్ని భయపెట్టాలనుకోవడం జగన్ రెడ్డి పగటి కల మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. మాపై ఎన్ని దాడులు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడుతామని స్పష్టం చేశారు.. ఆనంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని యనమల డిమాండ్ చేశారు.