27.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

ఐటీ కోసం కొత్త పాలసీ తీసుకురాబోతున్నాం – నారా లోకేశ్‌

మూడు నెలల్లో విశాఖకు TCS వస్తుందని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ కంపెనీలు, ఉద్యోగాల కల్పనపై ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఐదు సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే తమ లక్ష్యమని వివరించారు. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఈ పరిశ్రమలను ఆనాడు చొరవతో తీసుకొచ్చామని.. అనేక సదస్సులు ఏర్పాటుచేసి విశాఖపై దృష్టిసారించామన్నారు. ముందుచూపుతో ఆనాడు డేటా సెంటర్‌ పాలసీ తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని వివరించారు. భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశామని.. కానీ అది ఆగిపోయిందన్నారు. 2019-24 మధ్య ఒక్క కాంక్లేవ్‌ జరగలేదన్న మంత్రి.. ఒక్క పరిశ్రమ కూడా రాలేదని సభలో వివరించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్