మూడు నెలల్లో విశాఖకు TCS వస్తుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ కంపెనీలు, ఉద్యోగాల కల్పనపై ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఐదు సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే తమ లక్ష్యమని వివరించారు. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఈ పరిశ్రమలను ఆనాడు చొరవతో తీసుకొచ్చామని.. అనేక సదస్సులు ఏర్పాటుచేసి విశాఖపై దృష్టిసారించామన్నారు. ముందుచూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని వివరించారు. భూములు కేటాయించి శంకుస్థాపనలు చేశామని.. కానీ అది ఆగిపోయిందన్నారు. 2019-24 మధ్య ఒక్క కాంక్లేవ్ జరగలేదన్న మంత్రి.. ఒక్క పరిశ్రమ కూడా రాలేదని సభలో వివరించారు.