వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజయనగరం నగర పాలక సంస్థ ఆఫీసు వద్ద వాలంటీర్లు ధర్నా చేశారు. రాజీనామా చేయని వాలంటీర్లని కొనసాగిస్తూ.. వారికి ఇవ్వాల్సిన గౌరవ వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా తాము ఎన్నో అవస్థలు పడుతున్నామని వాలంటీర్లు వాపోయారు. ఎన్నికల ముందు కూటమి తమకు ఇచ్చిన జీతాల పెంపు, సర్వీసు కొనసాగింపు హామీని నెరవేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వాలంటీర్లు విజ్ఞప్తి చేశారు.