27.7 C
Hyderabad
Sunday, June 29, 2025
spot_img

A Masterpiece: న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరోని చూశారా?

శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు సుకు పూర్వజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘ఏ మాస్టర్ పీస్’. అరవింద్ కృష్ణ, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఏ మాస్టర్ పీస్ సినిమా నుంచి తాజాగా ప్రీ టీజర్‌ను రిలీజ్ చేశారు. సూపర్ హీరోను పరిచయం చేస్తూ స్టన్నింగ్ విజువల్స్, డైలాగ్స్‌తో ఈ ప్రీ టీజర్ ఆకట్టుకుంది. ప్రీ టీజర్ చూస్తే.. సమాజంలో జరిగే నేరాలపై స్పందించడం చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకుంటాడు హీరో. అతన్ని తల్లి మందలిస్తూ ఉంటుంది. కోరుకున్నట్లే పెరిగి పెద్దయ్యాక సూపర్ హీరో అవుతాడు. చిన్నప్పుడు గొడవలు ఎందుకని చెప్పిన తల్లే…అతను సూపర్ హీరో అయ్యాక..వాడు ఎదురొస్తే డీల్ చేయగలిగే దమ్ము మీకుందా అంటూ ధైర్యంగా సవాల్ చేస్తుంది. బలమున్న వాడిని పట్టుకోవాలంటే పవర్ కావాలి. కానీ నీలా బలం ఫ్లస్ పవర్ ఉన్నవాడిని పట్టుకోవాలంటే ఎమోషన్ కావాలి..అంటూ ప్రీ టీజర్‌లో వచ్చిన డైలాగ్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయి.

ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ తుది దశలో ఉన్న “ఏ మాస్టర్ పీస్” సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్స్‌పీరియన్స్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. గతంలో ఈ సినిమా నుంచి విడుదల చేసిన హీరో అరవింద్ కృష్ణ ఫస్ట్ లుక్, సూపర్ విలన్ మనీష్ గిలాడ్ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

నటీనటులు – అరవింద్ కృష్ణ, స్నేహ గుప్త, అర్చనా అనంత్, జ్యోతి రాయ్, జయప్రకాశ్ తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ- శివరామ్ చరణ్

సంగీతం- ఆశీర్వాద్

ఎడిటర్ – మనోజ్ కుమార్. బి

కాస్ట్యూమ్స్ – రియా పూర్వజ్, సలీనా విలియమ్స్, యూకే,

స్టంట్స్ – రాజ్ కుమార్ గంగపుత్ర

పీఆర్వో – జీఎస్కే మీడియా

నిర్మాత – శ్రీకాంత్ కండ్రేగుల

రచన దర్శకత్వం – సుకూ పూర్వజ్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్