గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కొత్తగూడెంలో మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల,పొంగులేటితో కలిసి రూ.130 కోట్లతో అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. బీఆర్ఎస్ పాలనలో మిషన్ భగీరథకు రూ.42 వేల కోట్లు ఖర్చు పెట్టారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రతి ఇంటికి నీళ్లిస్తే రూ.125 కోట్లతో మళ్లీ పనులు ఎందుకు చేపతామని ప్రశ్నించారు. గతంలో వెలుగులు నింపిన థర్మల్ ప్రాజెక్టులు మూతపడ్డాయని తెలిపారు. థర్మల్ ప్రాజెక్టులు మొదలు పెడితే ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రశ్నించారు.