24.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

ఉగాది స్పెషల్‌గా ఏప్రిల్ 12న ఓటీటీలో విశ్వక్ సేన్ ‘గామి’

తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ముందు ఉంటుంది ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మరో కొత్త సినిమాతో పలకరించటానికి సిద్ధమైంది. ఆ చిత్రమే ‘గామి’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించారు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది. విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 8న థియేటర్స్‌లో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్‌ను రాబట్టకుంది. ఈ సూపర్ హిట్ చిత్రాన్నిఉగాది సందర్భంగా జీ 5 ఏప్రిల్ 12 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనుండటం విశేషం. 

హరిద్వార్‌లో ఉండే అఘోరా శంకర్ (విశ్వక్ సేన్) వింత సమస్యతో బాధపడుతుంటాడు. అందుకనే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా శంకర్ తనున్న ప్రదేశాన్ని వీడి తన సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళతాడు. అక్కడ తన సమస్యకు పరిష్కారం దొరికే చోటు హిమాలయాలు అని తెలుస్తుంది. అక్కడ 36 ఏళ్లకు అరుదుగా దొరికే మాలి పత్రాలు కోసం శంకర్ అన్వేషిస్తూ బయలుదేరుతాడు. అదే సమయంలో అతనికి డాక్టర్ జాహ్నవి పరిచయం అవుతుంది. ఈ ప్రయాణంలో శంకర్ మనసులో చిత్ర విచిత్రమైన ఆలోచనలు, కలలు వస్తుంటాయి. ఓ పల్లెటూరుల్లో ఉండే దేవదాసి ఉమ, ఓ ప్రయోగశాలలో చిక్కుకుని తప్పించుకోవాలనుకునే ఓ యువకుడు కనిపిస్తుంటారు. అసలు వాళ్లకు శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? శంకర్ సమస్య ఏంటి? తన సమస్యకు శంకర్ పరిష్కారం కనుక్కున్నాడా? అనే విషయాలను దర్శకుడు తెరకెక్కించిన తీరు అభినందనీయం.

నరేశ్ కుమార్, స్వీకర్ అగస్తి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పాటు విశ్వనాథ్ రెడ్డి, ర్యాంపి నందిగాం సినిమాటోగ్రఫీ సినిమాను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. చక్కటి ఎమోషన్స్‌తో ఎప్పుడు ఏం జరుగుతుందా? అని ఆసక్తికరమైన కథనం, చక్కటి విజువల్స్ అన్ని ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ఇప్పుడు ఈ విజువల్, ఎమోషనల్ వండర్ జీ5 ద్వారా ఓటీటీ ప్రేక్షకులను అలరించటానికి ఏప్రిల్ 12న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సిద్ధమైంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్