30.2 C
Hyderabad
Saturday, December 2, 2023
spot_img

న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ ప్రయాణం ప్రారంభం

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ప్రారంభం అయింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. మంచు విష్ణు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కన్నప్ప సినిమా రాబోతోంది. ఈ మూవీలో ప్రభాస్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్న విషయం తెలిసిందే.

పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, ప్రసాద్ నాయుడు ఈ చిత్రానికి రచయితలు. ఈ సినిమా షూట్‌కు సంబంధించిన ప్రకటనను మంచు విష్ణు ట్వీట్ చేశారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను తెరకెక్కించే క్రమంలో తోడ్పడుతున్న ప్రతీ ఒక్కరికీ ఆయన థాంక్స్ చెప్పారు.

తాజాగా ఆయన చేసిన ట్వీట్ సారాంశం ఇదే. ‘న్యూజిలాండ్‌లోని అద్భతమైన లోకేషన్లలో కన్నప్ప షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాం. ఆ శివపార్వతుల ఆశీస్సులతోనే ఏడేళ్ల నా శ్రమ, కల నిజం కాబోతోంది. ఈ సినిమా కోసం 8 నెలలుగా టీం అంతా నిద్రలేని రాత్రులు గడిపింది. పండుగలు, పబ్బాలు కూడా మరిచిపోయి పని చేశాం. కనీసం రోజుకు 5 గంటల నిద్ర కూడా ఉండేది కాదు. ఎంత కష్టంగా అనిపించినా కూడా ఏ ఒక్కరూ అలిసిపోకుండా శ్రమించారు.

ఏడేళ్ల క్రితం తనికెళ్ల భరణి గారు నాతో ఈ కన్నప్ప కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడే దాని స్థాయి ఎలా ఉంటుందో ఊహించుకున్నాను. ఆ తరువాత ఈ కథలోకి ఎంతో మంది ప్రతిభావంతులైన నిపుణులు వచ్చి చేరారు. పరుచూరి గోపాలకృష్ణ గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, తోటపల్లి సాయి నాథ్ గారు, ప్రసాద్ నాయుడు గారు, నాగేశ్వరరెడ్డి గారు, ఈశ్వర్ రెడ్డి గారు ఇలా అందరూ కలిసి ఈ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచారు.

కన్నప్ప సినిమాకు ప్రాణం పోసేందుకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 600 మంది పని చేస్తున్నారు. ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేస్తే ఈ కన్నప్ప నేడు ఇక్కడి వరకు వచ్చింది. కన్నప్ప చేయగలనా? లేదా? అని నా మీద నాకే సందేహం కలిగినప్పుడు.. నన్ను నమ్మి ప్రోత్సహించిన, ముందుకు నడిపించిన మా నాన్న గారికి థాంక్స్. నా బ్రదర్ వినయ్ ప్రోత్సాహం నేను ఎప్పటికీ మరిచిపోలేను.

కన్నప్ప సినిమాలో ఎంతో మంది సూపర్ స్టార్లు నటించబోతున్నారు. ఆ వివరాలన్నీ త్వరలోనే రివీల్ చేయబోతున్నాం. మేం ఎంత సీక్రెట్‌గా ఉంచుదామని అనుకుంటున్నా కొన్ని లీక్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో సినీ ప్రేక్షకులు కేవలం మా ప్రొడక్షన్ అధికారిక ఖాతాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. మా కన్నప్ప ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న ఈ తరుణంలో అందరి ఆశీస్సులు, ప్రేమ, సపోర్ట్‌‌ను మేం కోరుకుంటున్నాం. కన్నప్ప అనేది కేవలం సినిమా కాదు.. అది మా ప్రాణం, నమ్మకం, ఎంతో మంది కష్టం. మా ప్రయాణం ప్రారంభం అయింది. మనమంతా కలిసి ఓ మ్యాజిక్‌ను క్రియేట్ చేద్దాం. హర హర మహదేవ్’ అంటూ మంచు విష్ణు ట్వీట్ వేశారు.

Latest Articles

‘సాగర్’ వివాదంపై అంబటి రాంబాబు ప్రజెంటేషన్

అమరావతి: నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైనదని మంత్రి చెప్పారు. నాగార్జున సాగర్ అంశంపై తప్పుడు రాతలు రాస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
291FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్