23.7 C
Hyderabad
Thursday, November 6, 2025
spot_img

విజయవాడను వదలని వరద కష్టాలు

ఆరు రోజులుగా వరద బీభత్సంతో విజయవాడ విలవిలలాడుతోంది. పలు కాలనీలు ఇప్పటికీ జలదిగ్భంధంలో చిక్కుకుని అక్కడి ప్రజలు నానా అవస్తలు పడుతున్నారు. జక్కంపూడి, వైఎస్‌ఆర్‌ కాలనీ, కండ్రిక, ప్రకాష్‌నగర్‌, సింగ్‌నగర్‌, నందమూరి నగర్‌లలో వరద తగ్గుముఖం పట్టకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద నీరు, బురదను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వరదలో చిక్కుకున్న బాధితులకు ఆహారం, మంచినీళ్లను అందజేస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బెజవాడను ముంచెత్తిన బుడమనేరు కాస్త శాంతించి.. మళ్లీ ఉధృతి దాల్చడంతో నగరంలోని పలు కాలనీలకు వరద తాకిడి పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని జనం ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నారు. బుడమేరు వాగుకు పలుచోట్ల గండ్లు పడడంతో నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. మూడు చోట్ల గండ్లు పడగా.. రెండింటిని పూడ్చినా మూడోది కష్టతరంగా మారిందని తెలిపారు అధికారులు. దీంతో ఆర్మీసాయం కోరారు సీఎం చంద్రబాబు.

విజయవాడను వరద ముంచెత్తడంతో సీఎం చంద్రబాబు అవిశ్రాంతంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూనే ఉన్నారు. సహాయక చర్యలపై దృష్టిసారించిన ఆయన.. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వారిని మరింత అలర్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ 6వ రోజు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించననున్నారు సీఎం చంద్రబాబు. వరద విలయంతో జనం తిండికి నానా అవస్తలు పడుతున్న వరద బాధితులను నేడు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు.

నగరంలోని పలు కాలనీలు ఇప్పుడిప్పుడే వరద ముంను బయటపడుతున్నాయి. దీంతో బురదను తొలగించే పనులు శర వేగంగా సాగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ఈ పనుల్లో బిజీ అయ్యారు. అధికారులు, పాలకులు దగ్గర ఉండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. అలాగే వరద విలయంతో నగరం అంధకారం కావడంతో.. విద్యుత్‌ పునరుద్దరణ పనులు కూడా ముమ్మరంగా సాగిస్తున్నారు. అయితే,.. ఇప్పటికీ వరద ఉండటంతో పనులకు ఆటంకం కలుగుతోంది. సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌పై రాకపోకలకు అనుమతించారు అధికారులు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్