స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: సెలబ్రెటీల జాతకాలు చెబుతూ ఈ మధ్య కాలంలో వేణుస్వామి బాగా ఫేమస్ అయ్యారు. నాగచైతన్య సమంత విడాకులు, నయనతార-ప్రభుదేవాల బ్రేకప్, ఇండస్ట్రీలో 40ఏళ్ల హీరో చనిపోతాడని చెప్పడం.. ఆయన చెప్పినట్లే అవి జరగడంతో వేణుస్వామిని నమ్మడం మొదలుపెట్టారు. దీంతో హీరోయిన్స్ రష్మిక, నిధి అగర్వాల్ అయితే ఆయన చేత యాగాలు కూడా జరిపించుకున్నారు. తాజాగా అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ సినిమాలు వరుసగా ఎందుకు ఫ్లాపులు అవుతున్నాయో ఓ కారణం చెప్పారు.
అఖిల్ జాతకంలో నాగదోషం ఉందని.. ఈ దోషం ఉన్నవారు ఇతర సలహాలు తీసుకోకూడదని తెలిపారు. అఖిల్ సొంతంగా నిర్ణయాలు తీసుకుని సినిమాలు చేస్తే మంచి విజయాలను అందుకుంటాడన్నారు. అఖిల్ జాతకంలో చంద్రుడు నీచంలో ఉన్నాడన్నారు. తల్లి చంద్రుడు.. తండ్రి సూర్యుడు అనుకుంటే.. చంద్రుడు నీచంలో ఉండటం వల్ల అఖిల్ సినిమాల విషయంలో తల్లి అమల ప్రమేయం కలిసి రాదని తేల్చిచెప్పారు.
అయితే అఖిల్ నటించిన ‘ఏజెంట్’ చిత్రం విడుదలకు కొద్దిరోజుల ముందే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పినట్లుగానే ‘ఏజెంట్’ మూవీ పెద్ద డిజాస్టర్ అవ్వడంతో వేణుస్వామి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.