మైలవరం YCP ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్ వెళ్లారు. అక్కడే ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్‌కు కండువా కప్పిన చంద్రబాబు.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మైలవరం అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరానని వసంతకృష్ణ ప్రసాద్ తెలిపారు. పార్టీ ఎక్కడ చెబితే అక్కడ పనిచేస్తానన్నారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరడాన్ని దేవినేని ఉమ అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. దేవినేని ఉమ, వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం టికెట్ కోసం పట్టుబడుతున్నారు. టికెట్ తనకే అంటూ వసంత కృష్ణ ప్రసాద్ ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. మండల స్థాయి నేతలతో వసంత కృష్ణ ప్రసాద్ ఫోన్‌లో టచ్‌లోకి వెళ్లారు. వసంత టీడీపీలో చేరడంతో మైలవరంలో వసంత ఫ్లెక్సీని దహనం చేశారు,


