స్వతంత్ర వెబ్ డెస్క్: కాకినాడ జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర షెడ్యూల్ ఇలా ఉంది. ఈ నెల 14న ఉదయం 9 గంటలకు అన్నవరంలోని సత్యదేవుని దర్శనం, వారాహి వాహనానికి పూజలు.. తరువాత సాయంత్రం 4 గంటలకు వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది.. సాయంత్రం 5 గంటలకు కత్తిపూడి కూడలిలో బహిరంగ సభ జరుగుతుంది. అనంతరం 6 గంటలకు పిఠాపురం నియోజకవర్గం చేరుకుని అక్కడ బస చేస్తారు.
జూన్ 15 ఉదయం 9 గంటలకు పిఠాపురంలో ప్రముఖులు, విద్యావేత్తలు, వృత్తి నిపుణులు, ఎన్జీఓ ప్రతినిధులతో సమావేశం ఉంటుంది. పది గంటలకు జనవాణి, స్థానిక సమస్యలపై వినతుల స్వీకరణ. 11కు వీర మహిళా విభాగం, మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు.
జూన్16 ఉదయం 9 గంటలకు పిఠాపురంలో స్థానిక నాయకులతోను, పది గంటలకు కార్మిక, రైతు, చేతి వృత్తుల వారితో సమావేశం. 11 గంటలకు క్షేత్ర స్థాయి పరిశీలన, సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ. రాత్రి ఏడు గంటలకు కాకినాడ చేరుకుని బస చేస్తారు.
జూన్ 17న కాకినాడలో ఉదయం 9 గంటలకు మేధావులతో సమావేశం, 10 గంటలకు జనవాణి, వినతుల స్వీకరణ, 11 గంటలకు వీర మహిళల విభాగంతో, మధ్యాహ్నం 12కు మీడియాతో సమావేశాలు నిర్వహిస్తారు.
18న ఉదయం 9 గంటలకు కాకినాడలో స్థానిక నాయకులతో, పది గంటలకు కార్మిక, రైతు, చేతి వృత్తుల వారితో సమావేశాలు. 11గంటలకు కాకినాడ గ్రామీణం పరిధిలో క్షేత్ర స్థాయి పరిశీలన. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద సాయంత్రం 5. గంటలకు బహిరంగ సభ.
19న ఉదయం 9 గంటలకు స్థానికులతో సమావేశం, మధ్యాహ్నం12కు కాకినాడ అర్బన్ పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలన, ఒంటి గంటకు ముమ్మిడివరం నియోజకవర్గానికి ప్రయాణం.
డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వారాహి యాత్ర షెడ్యూల్ ఇలా… ఈనెల 19న మధ్యాహ్నం ఒంటి గంటకు కాకినాడ నుంచి ముమ్మిడివరం నియోజకవర్గానికి యాత్ర బయలుదేరి యానాం మీదుగా ముమ్మిడివరం చేరుకుంటుంది. సాయంత్రం ముమ్మిడివరంలో బస ఉంటుంది.
20న ఉదయం 9 గంటలకు ముమ్మిడివరంలో మేధావులతో సదస్సు, 10 గంటలకు జనవాణి, వినతుల స్వీకరణ, 11 గంటలకు వీర మహిళ విభాగంతో, మధ్యాహ్నం 12కు రైతు కూలీలు, గీత కార్మికులతో సమావేశాలు ఉంటాయి. సాయంత్రం 5 గంటలకు ముమ్మిడివరం లో బహిరంగ సభ. అక్కడి నుంచి రాత్రి 8 గంటలకు అమలాపురం చేరుకుని అక్కడ బస చేస్తారు.
21న అమలాపురంలో మేధావులతో సమావేశం. 10 గంటలకు జనవాణి, వినతుల స్వీకరణ, 11 గంటలకు వీర మహిళా విభాగం, మధ్యాహ్నం 12 గంటలకు మీడియాతో సమావేశాలు. సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ, రాత్రి 7 గంటలకు అమలాపురం లోనే బస.
22న ఉదయం 9 గంటలకు అమలాపురంలో రైతులు, దళిత వర్గాలతో, 10కి స్థానిక నాయకులతో 11.30కి మీడియాతో సమావేశాలు. సాయంత్రం 4 గంట లకు పి. గన్నవరం నియోజకవర్గం మీదుగా రాజోలు నియోజకవర్గానికి ప్రయాణం. పి. గన్నవరం నియోజకవర్గంలో రోడ్డు షో. రాత్రి 7 గంటలకు రాజోలు నియోజకవర్గం మలికిపురం లో సభ, రాత్రి 9 గంటలకు దిండిలో బస.
23న ఉదయం 9 గంటలకు దిండిలో ప్రముఖులు, విద్యావేత్తలతో సమావేశం, 10కి జనవాణి, వినతుల స్వీకరణ, 11కి వీర మహిళ విభాగం, మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక నాయకులతో సమావేశాలు. మూడు గంటలకు సఖినేటిపల్లి నుంచి పంటు మీదుగా నరసాపురం ప్రయాణం. సాయంత్రం 5 గంటలకు నరసాపురంలో బహిరంగ సభ, రాత్రి బస చేయనున్నారు.