స్వతంత్ర వెబ్ డెస్క్: వంగవీటి రాధా కృష్ణ(Vangaveeti Radha Krishna).. గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఏపీ పాలిటిక్స్ లో(AP Politics) కీలక నేత.. పొలిటికల్ లీడర్ అయిన రాధా.. పెళ్ళి(Marriage) ఎప్పుడు చేసుకుంటారని ఆయన అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇక ఆయన పెళ్లి పీటలు ఎక్కనున్నారని తెలిసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. పెళ్లికి ముందు నిశ్చితార్థం వేడుక కూడా త్వరలోనే జరగనుందట.. ఇక ఆ తరువాత పెళ్లి కూడా జరుగనుంది. వచ్చే ఎన్నికలలోపే రాధా ఒకింటివారు కానున్నారు. అంటే సెప్టెంబర్ 6న రాధా వివాహం జరుగనుంది.
పొలిటికల్ ఛరీష్మా ఉన్న రాధాకు కాబోయే భార్య ఎవరు? అనేది ఆసక్తిగా మారిన క్రమంలో ఆమె ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంకు(Narasapuram) చెందిన అమ్మాయి. నర్సాపురం పట్టణానికి చెందిన యువతితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైంది. తన మిత్రుడికి దగ్గర బంధువుల అమ్మాయితో ఈ వివాహం నిశ్చయం అయినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 19న నర్సాపురంలో ఎంగేజ్మెంట్ జరుగుతుందని.. సెప్టెంబర్ 6న వివాహం ముహూర్తం ఖరారు చేశారని తెలుస్తోంది. ఈక్రమంలో 55 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకుంటున్నారని తెలిసి ఆయన అభిమానులు సంతోషపడుతున్నారు.