వనపర్తి జిల్లా కొల్లాపూర్‌లోని లక్ష్మీపల్లిలో బిఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. లక్ష్మీ పల్లిలో శ్రీధర్ రెడ్డిని దారుణంగా గొడ్డలితో నరికి హతమార్చారు. శ్రీధర్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. అయితే రాజకీయ విద్వేషాల కారణంగా హత్య జరిగిందని బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బొడ్డు శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తుందని ఆయన ఆరోపించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ హత్య రాజకీయంగా జరిగిందా.. లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.