వల్లభనేని వంశీ.. ఇప్పుడీ పేరు తెలుగు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు మోస్ట్ పాపులర్ పొలిటీషియన్‌గా ఉన్న వంశీ.. తన నోటి దురుసుతో అందరికీ వ్యతిరేకుడిగా మారిపోయాడు. అధికారంలో ఉన్నాం.. తననేం చేయలేరనే పొగరుతో.. చేసిన వ్యాఖ్యలు.. ఇవ్వాళ కటకటాల వెనక్కు నెట్టాయి. ఒకప్పుడు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీనే.. ఇష్టానుసారం తిట్టడం ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. నోరు అదుపులో లేకపోతే ఎవరికైనా ఎలాంటి పరిస్థితి వస్తుందో వంశీనే ప్రత్యక్ష ఉదాహరణ.
వంశీ.. అదే దూకుడుతో ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వంశీ అంటే చాలా మందికి అభిమానమే ఉంది. కానీ ప్రస్తుతం ఆయన ఏ కేసులో అయితే అరెస్టు అయ్యారో.. ఆ విషయంలో మాత్రం ఎవరూ సపోర్ట్ చేయడం లేదు. తమ పార్టీ వాడనే కారణంతో వైసీపీ నాయకులు అరెస్టును ఖండిస్తున్నా.. ఒకప్పుడు చంద్రబాబు ఫ్యామిలీపై వంశీ చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కావని వారికీ తెలుసు.
సినీ నిర్మాతగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన వల్లభనేని వంశీ.. దివంగత టీడీపీ సీనియర్ నేత పరిటాల రవీంద్ర అనుచరుడిగా టీడీపీకి దగ్గరయ్యారు. జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాలు తీసి ఆయన ద్వారా టీడీపీలో ఒక స్థాయి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో తొలిసారి టీడీపీ టికెట్ పై విజయవాడ పార్లమెంటుకు పోటీ చేసిన వంశీ.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక 2014లో రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన ఎన్నికల్లో వంశీ గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. పరిటాల రవి, జూనియర్ ఎన్టీఆర్‌తో గతంలో ఉన్న సంబంధాలు.. పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయినా.. పార్టీ కోసం పని చేయడంతో చంద్రబాబు ఆయనకు గన్నవరం టికెట్ ఇచ్చారు. 2019లో కూడా వల్లభనేని వంశీకే గన్నవరం టికెట్ దక్కింది.
2019 ఎన్నికలకు ముందే వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో.. గన్నవరానికి వచ్చిన జగన్‌కు ఎదురు వెళ్లి మరీ వంశీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. కానీ అప్పట్లో టీడీపీ అధిష్టానం దాన్ని పెద్దగా పట్టించుకోకుండా టికెట్ ఇచ్చింది. అయితే వైసీపీ గెలిచిన తర్వాత వల్లభనేని వంశీ.. జగన్‌కు దగ్గరయ్యారు. అయితే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలతో పోలిస్తే.. వంశీ కాస్త దూకుడుగా వ్యవహరించారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వ్యక్తిగత దూషణలకు దిగి తన గోతిని తానే తవ్వుకున్నారు. ఒకానొక సమయంలో వంశీ ఏకంగా అసెంబ్లీలోనే ఇలా నోరు జారడంతో చంద్రబాబు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆనాడే ఈ సభకు ఇక రానని.. గెలిచిన తర్వాతే తిరిగి అసెంబ్లీలోకి వస్తానని చంద్రబాబు ప్రమాణం చేశారు. అదే వైసీపీకి తీరని నష్టాన్ని మిగిల్చింది.
వాయిస్ వోవర్ 5: వల్లభనేని వంశీ నోరు జారడంతో వైసీపీకి తీరని నష్టం జరిగింది. చంద్రబాబు అనుకున్నట్లుగానే వైసీపీని ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. చివరకు వైసీపీ ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత సాధించలేకపోయింది. ఇక వ్యక్తిగతంగా తాను ఎంతటి తప్పు చేశానో తెలుసుకున్న వంశీ నష్టనివారణ ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదు. చంద్రబాబు కుటుంబంపై మాట జారిన.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాయమైపోయారు. గత ఎనిమిది నెలలుగా వంశీ అండర్ గ్రౌండ్‌లోనే ఉన్నారు. తనపై నమోదైన కేసుల్లో బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని.. అమెరికా వెళ్లి వ్యాపారాలు చేసుకుంటానని కూటమి ప్రభుత్వానికి మధ్యవర్తుల ద్వారా సంప్రదించినా.. అటు నుంచి క్షమించే పరిస్థితి లేకపోవడంతో వంశీ ఉక్కిరిబిక్కిరి అయ్యారట.
అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వంశీ.. చివరకు ఏ పార్టీ నుంచి అయితే రాజకీయం ప్రారంభించాడో.. అదే పార్టీకి బద్ద శత్రువుగా మారాడు. ఒకే ఒక మాట.. వంశీ రాజకీయ భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టేసింది. మరి వంశీపై నమోదైన కేసులు ఎంత వరకు నిలుస్తాయో తెలియదు కానీ.. అతడికి మాత్రం ఇదొక గుణపాఠం అని అందరూ చర్చించుకుంటున్నారు.