మంచు చరియల కింద ఇంకా 8 ప్రాణాలు. ఉత్తరాఖండ్‌లో మంచు చరియలు బీభత్సం సృష్టించాయి. కార్మికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి.
హిమాలయ ప్రాంతాల్లో వరుస ఘటనలు ఇబ్బంది పెడుతున్నాయి. మంచు భారీగా కురుస్తుండడంతో రెస్క్యూ టీమ్స్ ఘటనాస్థలికి చేరుకోలేకపోతున్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలకు వాతావరణం సహకరించడం లేదు. నిన్న మంచు చర్యలు విరిగిపడి ఆ మంచు చరియల కింద 57 మంది చిక్కుకున్నారు. ఇప్పటి వరకు 33 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్.. మరో తాజాగా 14 మందిని రక్షించారు. మరో 8 మంది కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది. రక్షించిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
ఉత్తరాఖండ్‌లో అవలాంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ బృందాలు పొల్గొంటున్నాయి. సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలించారు సీఎం పుష్కర సింగ్ ధామీ. రెస్క్యూ టీమ్స్‌తో మాట్లాడారు. ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్‌కు విఘాతం కలుగుతుందని చెప్పారు,. హెలిపాడ్ మంచు కింద కూరుకుపోయిందని అన్నారు. దీంతో తాత్కాలిక హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు బీఆర్‌ఓ సిబ్బంది.