ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు నేపథ్యంలో న్యాయమైన చట్టపరమైన ప్రక్రియ చేపట్టాలని అమెరికా విదేశాంగ శాఖ పిలుపు ఇవ్వడాన్ని భారత్ నిరసించింది. భారత విదేశాంగ మంత్రిత్వశాఖ బుధవారం అమెరికన్ సీని యర్ దౌత్యవేత్తను పిలిపించి అధికారికంగా తమ నిరసన తెలిపింది. నాలుగు రోజుల క్రిత జర్మనీ దౌత్య వేత్తకు ఇదే విధమైన నిరసన తెలిపింది. భారత దేశంలో న్యాయపరమైన చర్యలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించి ఈ నిరసన తెలిపారు.