అభిమానులు కోరుకుంది.. వాళ్లు ఆశిచింది ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ అందించింది. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకతను SRH సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ముంబాయి ఇండి యన్స్ తో జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసి SRH ఇప్పటి వరకు ఎవ్వరు క్రియేట్ చేయని రికార్డును సృష్టించింది. 2016 టైటిల్ గెలిచిన తర్వాత గడిచిన 7 ఏళ్లుగా SRH తన అభిమానులను నిరాశ పరుస్తూ వచ్చింది. కానీ ఐపీఎల్ 2024 లో మొదటి మ్యాచ్ లో ఓడినప్పటికీ రెండో మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ అధ్బుతంగా ఆడి ఘన విజయం సాధించింది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టీమ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లారు.. హైదరాబాద్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్ 24 బాల్స్ లో 62, అభిషేక్ శర్మ 23 బాల్స్ లో 63, ఎడెన్ మార్క్ రమ్ 42 రన్స్ , 34 బాల్స్ లో హెన్రీ చ్ లాసిన్ 80 పరుగులు చేసి 277 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబాయి ఇండియన్స్ ముందు ఉంచారు. దీంతో 2013 లో పూణే వారియర్స్ పై RCB కొట్టిన 263 పరుగుల రికార్డును హైదరా బాద్ బ్రేక్ చేసింది. టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబాయి ఇండియన్స్ సైతం 4 వికెట్ వరకు హైదరాబాద్ అభిమానులను టెన్షన్ పెట్టారు.. మొదటి మూడు ఓవర్లకే 50 పరుగులు చేసిన ముంబాయి ఇండియన్స్ SRH పై ఒత్తిడి తెచ్చింది. ముంబాయి ఇండియన్స్ బ్యాటింగ్ లో తిలక్ వర్మ 64, రోహిత్ శర్మ 26, ఇషాన్ కిషన్ 34 , నమన్ 30, హార్థిక్ పాండ్య 24 , టీమ్ డేవిడ్ 42 రన్స్ చేసి 5 వికెట్లు కోల్పోయి 246 పరుగుల దగ్గర ఆగిపోయారు . 23 బాల్స్ లో 63 రన్స్ చేసి అధ్బుతంగా ఫీల్డింగ్ చేసిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.