30.9 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

ఐదు దేశాలకు ఐరాస తాత్కాలిక సభ్యత్వం

స్వతంత్ర వెబ్ డెస్క్: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఐదు దేశాలకు తాత్కాలిక సభ్యత్వం లభించింది. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా అల్జీరియా, గయానా, సియెర్రా లియోన్, స్లొవేనియా, దక్షిణ కొరియా ఎన్నికయ్యాయి. రేండేళ్ల కాలపరిమితికి గానూ ఐరాస సాధారణ సభ తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకుంది.

అయితే, ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంలో పాలుపంచుకుంటున్న బెలారస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి సభ్యత్వం ఇచ్చేందుకు సభ్య దేశాలు నిరాకరించాయి. కాగా, కొత్తగా ఎన్నికైన దేశాలు 2014, జనవరి1న బాధ్యతలు స్వీకరించనున్నాయి. తాత్కాలిక సభ్య దేశాల ఎంపిక కోసం జరిగిన ఓటింగ్ లో గయానాకు 191 ఓట్లు రాగా, సియోర్రా లియోన్ 188, అల్జీరియా 184, దక్షిణ కొరియాకు 180 ఓట్లు పోల్ అయ్యాయి.

కాగా, ఐదో సభ్య దేశంగా బెలారస్‌కు స్లొవేనియాకు మధ్య పోటీ నెలకొనగా స్లోవేనియాకు 153 ఓట్లు వచ్చాయి. బెలారస్ కు 38 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా, అల్బేనియా, బ్రెజిల్, గబాన్, ఘనా, యూఏఈ దేశాల పదవీ కాలం ఈ ఏడాది చివరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ ఐదు దేశాలకు తాత్కాలిక సభ్యత్వం కల్పించారు.

ఐరాస భద్రతా మండలిలో 15 దేశాలకు సభ్యత్వం ఉంటుంది. వాటిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు కాగా, 10 అశాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ ఉంది. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు శాశ్వత సభ్య దేశాలు. వీటికి వీటో హక్కు ఉంటుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్