24.7 C
Hyderabad
Monday, March 24, 2025
spot_img

PUBG Love Story: సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్టులు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రియుడు సచిన్ కోసం నేపాల్ నుంచి భారత్ కి వచ్చిన సీమా హైదర్ కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఆమె ప్రియుడి కోసం రాలేదని.. ప్రియుడి కంటే ముందుగా కొంతమందితో ఆమెకు సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. పబ్జీ గేమ్ ద్వారా భారత్ కి చెందిన సచిన్ తో ప్రేమలో పడి.. నేపాల్ మీదుగా మన దేశంలోకి అక్రమంగా చొరబడిన సీమా కేసులో ఊహించని ట్విస్టులు బయటపడుతున్నాయి. క్రాస్ బోర్డర్ లవర్ సీమా హైదర్ ని ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె నిజంగానే పాక్ ఐఎస్ఐ ఏజెంట్ ఏమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆమె సోదరుడు పాకిస్తాన్ ఆర్మీలో చేరాడని.. కానీ అతను మిలటరీలో కొనసాగుతున్నాడో లేదో తనకు తెలియదని సీమా వెల్లడించింది. సీమా స్టేట్మెంట్లు నిర్ధారించుకునేందుకు అధికారులు.. ఆమె భర్త గులాం హైదర్ ను విచారించారు.

సీమా హైదర్ పాకిస్తాన్ గురింపు కార్డుకు సంబంధించి ప్రామాణికతపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే పుట్టినప్పుడు పొందే గుర్తింపు కార్డు ఆమె 2022 సెప్టెంబర్ 20న పొందినట్లు తెలిసింది. ఆమె పాకిస్తాన్ పౌరసత్వ గుర్తింపు కార్డు పొందడంలో జాప్యం ఉండడంతో ఏటీఎస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వీసా లేకుండా భారత్ లో అడుగుపెట్టడంపై సోదాలు జరుగుతున్నాయి. అయితే ఏటీఎస్ అధికారులు అడిగే ప్రశ్నలు ఆమె ఎంతో ఆలోచించి తెలివిగా సమాధానం చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆమె నుంచి సమాధానాలు రాబట్టడం అంత సులువు కాదని అధికారులు పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే విచారణలో సీమా ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే సీమా హైదర్ పాక్ ఏజెంట్ అని.. ఆమెను తిరిగి తమ దేశానికి పంపాలని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ముంబై పోలీసులకు సందేశాన్ని పంపించగా.. దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణకు ముందు సీమా ఢిల్లీ పారిపోయేందుకు ప్రయత్నించగా ఆమెను అరెస్ట్ చేసినట్లు నోయిడా పోలీసులు వెల్లడించారు. సీమా హైదర్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని గ్రేటర్ నోయిడాలో సచిన్ మీనాతో కలిసి ఉంటుంది. 2019లో సీమా హైదర్, భారత్ కి చెందిన సచిన్ మీనాతో పబ్జీ ఆట ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ఇటీవల ఆమె మే నెలలో తన నలుగురి పిల్లలతో నేపాల్ నుంచి ఇండియాకి వచ్చింది. గ్రేటర్ నోయిడాలోని రబూపురలో ఉంటున్న 22 ఏళ్ల సచిన్ తో ఉండేందుకు భారత్ లో అడుగుపెట్టింది.
జూలై 4న అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిందని సీమా హైదర్ ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ వలసదారులకు ఆశ్రయం ఇచ్చిన కారణంగా సచిన్ మీనాను, అతని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. అయితే జూలై 7న ముగ్గురికీ స్థానిక కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముగ్గురినీ యూపీ ఏటీఎస్ అధికారులు విచారిస్తున్నారు. అయితే సీమా మాత్రం తాను భారత్ లోనే ఉంటానని.. పాకిస్తాన్ వెళ్లనని చెబుతుంది. కానీ ఆమె భర్త గులాం హైదర్ మాత్రం తన భార్యను పాక్ కి పంపించాలని కోరుతున్నాడు. ప్రియుడు కంటే ముందు ఢిల్లీలో సీమా ఎవరిని కలిసింది? ఆమె ప్లాన్ ఏమిటి? ఆసిఫ్ పాక్ సైన్యంలో ఆర్మీలో పనిచేయడం.. ఆమె ఇండియా రావడం వెనుక ఏమైనా కుట్రలు ఉన్నాయా? అన్న కోణంలో అధికారులు విచారిస్తున్నారు. ఇంకా ఈ సీమా హైదర్ కేసులో ఇంకెన్ని ట్విస్టులు చూడాల్సి వస్తుందో మరి.

Latest Articles

శిథిలాలయంగా బనగానపల్లె ఆయుర్వేద వైద్యాలయం-కిటికిటీలకు అద్దాలు అమరిస్తే కొత్త భవనం రెడీ-మీనమేషాల లెక్కింపుతో కాలహరణం

కొత్త వింత కావచ్చు, కాని పాతని రోతగా చూడ్డం ఏం సబబు.. ఏ కొత్తయినా పాతనుంచే పుడుతుంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ప్రజలపాలిట ఆరోగ్యప్రదాయినిలా ఉండే ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి శిథిల భవనంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్