IT Rides | టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. బుధవారం నుండి ఈరోజు వరకు సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు కొనసాగిస్తున్నారు. జీఎస్టీ సరిగా కట్టలేదన్న ఆరోపణల నేపథ్యంలో సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అధికారులు పలు విషయాలను పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరోవైపు, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులో 19 గంటలుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆర్బీఐ అనుమతి లేకుండా 500 కోట్ల రూపాయల వరకు విదేశాలనుంచి పెట్టుబడులు, బ్యాంకు ఖాతాల వివరాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. పేపర్స్ జిరాక్స్ కోసం భారీ ప్రింటర్స్ ని తెప్పించారు అధికారులు.