స్వతంత్ర, వెబ్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న క్రమంలో అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఈ సీజన్ విజేత ఎవరో తేల్చే ఉత్కంఠ పోరు మరికొద్దిసేపట్లో ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం అంతరాయం కలిగించిది. ప్రస్తుతానికైతే వర్షం ఆగేలా లేనట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ని ఎలా నిర్వహిస్తారు? ఎవరిని విజేతగా ప్రకటిస్తారనేది ఉత్కంఠగా మారింది.