నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విస్తృత అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని..కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. ఇక్కడ అవకాశాలు లేక యువత తెలంగాణ, కర్ణాటక వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వంలో విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎమ్మెల్యే వివరించారు. అంతకుముందు నియోజకవర్గ కేంద్రంలో గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు, అంజనాస్ ఫౌండేషన్ ఛైర్మన్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.