తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. పాలించడం చేతకాని కాంగ్రెస్ సర్కార్ తమ నిరసనకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రజల పక్షాన పనిచేయటం పార్టీల హక్కు అన్నారాయన. బీఆర్ఎస్ ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం అడ్డుకుంటోందని జగదీశ్‌రెడ్డి ఫైరయ్యారు. కేటీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వానికి, రేవంత్‌రెడ్డికి ఎందుకు వణుకు అన్నారు. నల్గొండ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వం అడ్డుకున్నా నల్గొండ రైతు దీక్ష చేస్తామని ఆయన స్పష్టం చేశారు.