28.1 C
Hyderabad
Saturday, June 21, 2025
spot_img

ఇజ్రాయెల్, హమాస్‌ యుద్ధం ముగిసేందుకు ఐక్యరాజ్యసమితి ఆమోదం

   ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య ఎనిమిది నెలలుగా జరుగుతున్న యుద్ధానికి తెరపడే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఈ దిశలో ఐక్యరాజ్యసమితి చొరవ చూపింది. గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న కాల్పులను విరమించాలని ఇటు ఇజ్రాయెల్ అటు హమాస్‌ను ఐక్యరాజ్య సమితి కోరింది. ఇందుకు సంబంధించి కాల్పుల విరమణ ప్రణాళికను కూడా ఐక్యరాజ్య సమితి రూపొందించింది. తాజాగా ఈ కాల్పుల విరమణ ప్రణాళికను భద్రతా మండలి ఆమోదించింది. ఇజ్రాయెల్, హమాస్‌ మధ్య యుద్ధానికి సంబంధించి దీని నొక కీలక ఘట్టంగా చెప్పుకోవచ్చు. మూడు దశలతో కూడిన కాల్పుల విరమణ ప్రణాళికను ఇజ్రాయెల్, హమాస్ తక్షణం అమలు చేయాలని తీర్మానం కోరింది. ఈ కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కిందటి నెలలో ప్రకటించింది.

   ఐక్యరాజ్యసమితి రూపొందించిన కాల్పుల విరమణ తీర్మానాన్ని భద్రతా మండలిలో అమెరికా ప్రతిపాదించింది. ఈ తీర్మానాన్ని భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల్లో 14 దేశాలు సమర్థించాయి.అయితే రష్యా మాత్రం ఓటింగ్ కు డుమ్మా కొట్టింది. కాల్పుల విరమణకు, యుద్దానంతరం గాజా పాలనకు సంబంధించిన ప్రణాళికలకు మద్దతు కూడగట్టే ఉద్దేశంతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. అంతేకాదు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కూడా ఆంటోనీ బ్లింకెన్ భేటీ అయ్యారు. కాల్పుల విరమణ పట్ల నెతన్యాహూ సానుకూలంగా స్పందిం చినట్లు ఆంటోనీ బ్లింకెన్ పేర్కొ న్నారు. ఇదిలా ఉంటే కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఓకే అంటోందని అమెరికా చెబుతు న్నప్పటికీ, ఇక్కడో తిరకాసు ఉంది. కాల్పుల విరమణ ప్రణాళికలోని కీలక అంశాలను కొన్ని రోజుల కిందట నెతన్యాహూ బహిరంగంగానే వ్యతిరేకించారు. అంతేకాదు హమాస్‌ను అంతమొందించడానికే తాము కట్టుబడి ఉన్నట్లు నెతన్యాహూ పేర్కొన్నారు.

    ఇజ్రాయెల్ సంగతి ఇలా ఉంటే కాల్పుల విరమణ ప్రతిపాదనపై హమాస్ స్పందన తెలియాల్సి ఉంది. అయితే భద్రతా మండలి తాజా తీర్మానాన్ని హమాస్ శిబిరం స్వాగతించినట్లు వార్తలందుతున్నాయి. అయితే కాల్పుల విరమణ ప్రణాళికకు సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టత రావాలని హమాస్ శిబిరం పేర్కొంది. అంతేకాదు ఈ ఘర్షణలకు శాశ్వత ముగింపు ఉండాలని హమాస్ శిబిరం కోరుతున్నట్లు రాజకీయవర్గాల సమాచారం. ఐక్యరాజ్యసమితి పనితీరు కొంతకాలంగా వివాదాస్పదమైంది. ఆవిర్భావం నుంచి చాలా కాలం వరకు ఐక్యరాజ్య సమితి పాత్ర ప్రశంసనీయంగా ఉంది. అయితే కొన్ని సందర్బాలలో సమితి పనితీరు ప్రపంచ దేశాలకు నిరాశ మిగిల్చింది. అమెరికా, సూడాన్ దేశాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కరించడంలో విఫలమైందన్న పేరు సమితి తెచ్చుకుంది. ఇలాంటివే మరికొన్ని ఘటన లు సమితి ఇమేజ్‌ను ప్రపంచ దేశాల దృష్టిలో దెబ్బతీశాయి.ముఖ్యంగా యుద్ధాల్ని నివారించడంలో విఫలమైం దన్న విమర్శలు ఐక్యరాజ్య సమితి మూటగట్టుకుంది. ప్రధానంగా రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని చెప్పుకోవచ్చు. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై రెండేళ్లు దాటింది. అయితే ఇప్పటికీ ఈ యుద్ధానికి ఎండ్ కార్డు పడలేదు. ఈ యుద్ధం ఎంతకాలం నడుస్తుందో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. అసలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుం దో, లేదో కూడా ఎవరూ చెప్పలేకపోతు న్నారు. ఐక్యరాజ్యసమితి అయితే ఈ విషయంలో దాదాపు చేతులు ఎత్తేసిట్లే.

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం అయినప్పటికీ, ప్రపంచంలోని అనేక దేశాలకు ఈ యుద్ధంతో పరోక్ష సంబంధం ఉంది. ఒకవైపు రష్యాకు ఆయుధాలు సరఫరా చేసి ఉత్తర కొరియా యుద్ధాన్ని రాజేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌కు అమెరికా సహా అనేక యూరోపియన్ దేశాలు అత్యంత ఆధునిక ఆయుధాలు అందచేసి యుద్ధాన్ని ఎగదోస్తున్నాయి. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం నివారించడంలో ఐక్యరాజ్య సమితి పూర్తిగా వైఫల్యమందన్న విషయం సందేహాలకతీతంగా స్పష్టమైంది. అలాగే ఎనిమిది నెలలుగా ఇజ్రాయెల్ – హమాస్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ పోరులో ఒకసారి ఇజ్రాయెల్ పై చేయి అయితే, మరోసారి హమాస్ శిబిరానిది పై చేయి అవుతోంది. రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణను పాటించాలని అమెరికా చేసిన వినతిని కూడా ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ ఖాతరు చేయలేదు. ఇంత జరుగుతున్నా, నెతన్యాహూ ను కట్టడి చేయడానికి ఐక్యరాజ్యసమితి ఎటువంటి చొరవ చూపలేదు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ – హమాస్ మధ్య పోరుకు తాజాగా ఐక్యరాజ్యసమితి కాల్పుల విరమణ ప్రణాళిక రూపొందించడం విశేషం.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్