స్వతంత్ర, వెబ్ డెస్క్: నెల్లూరులో విషాదం నెలకొంది. పెన్నానది సమీపంలో పిల్లలను రక్షించబోయి ఇద్దరు తల్లులు మృతి చెందారు. పెన్నానది రివిట్‌మెంట్ వాల్ నిర్మాణం కోసం తవ్విన గుంతలో ఇద్దరు చిన్నారులు పడిపోయారు. పిల్లలను రక్షించేందుకు గుంతలోకి తల్లులు దూకారు. ఈ క్రమంలో పిల్లల్ని కాపాడారు. వారి ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఇద్దరు తల్లులు బురదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.