సాధారణంగా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని అబ్బాయిలు గొడపపడుతుండటం చూస్తుంటాం. తమ హీరోను ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోరు. కానీ అమ్మాయిలు కూడా హీరో కోసం గొడవపడడం ఎక్కడైనా చూశారా? మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇది చోటుచేసుకుంది. గ్లోబల్ స్టార్ రాంచరణ్(RamCharan) లేడి అభిమానికి, వేరే అమ్మాయికి మధ్య గొడవ జరిగింది. మా హీరోనే అంటావా అని తోటి విద్యార్థుల మధ్యే ఇద్దరు కొట్టుకున్నారు. పక్కన ఉన్న విద్యార్థులు వారిని విడిపించడానికి ప్రయత్నించినా వెనక్కు తగ్గలేదు. మార్చి27న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ram charan lady fans fan war pic.twitter.com/Gqc4rZhOjE
— KingJdeep (@KingJdeep) March 27, 2023