23.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

మేఘాల మధ్య విమానంలో అల్లకల్లోలం

   సింగపూర్‌ ఎయిర్‌లెన్స్‌ ఘటన ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. లండన్‌ నుంచి సింగపూర్‌ బయలు దేరిన ఆ విమానం సృష్టించిన అల్లకల్లోలం గురించే టాక్‌ నడుస్తోంది. గాల్లో తేలిపోతూ పై ప్రాణాలుపైనే పోయేసరికి ఆ ప్రమాదం వెనుక ఉన్న కారణాల గురించి అంతా అన్వేషిస్తున్నారు. మరి ఆ అల్లకల్లోలానికి కారణమేంటి..? ప్రకృతి ప్రకోపమా? మేఘాల ఆగ్రహమా..?

    ఆకాశ వీధిలో అల్లకల్లోలం అలజడి రేపింది. అప్పటి వరకూ హాయిగా గాల్లో తేలిపోతున్నట్టు ఉన్న ప్రయాణం కాస్త ప్రాణాల మీదకు తెచ్చింది. గగనతలంలో ఓ కుదుపు కుదేసి ఒకరిని బలితీసుకుంది. ఇదంతా లండన్‌ నుంచి సింగపూర్‌ బయలు దేరిన బోయింగ్‌ ఫ్లైట్‌ జర్నీలో జరిగిన సంఘటన. మే 20న సింగపూర్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన విమానం మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో కలిసి లండన్‌ నుంచి సింగపూర్‌కు బయలు దేరింది. అయితే, ఫ్లైట్‌ స్టార్‌ అయి సుమారు 11 గంటలు ప్రయాణించి.. మరికొన్ని గంటల్లో గమ్యస్థానానికి చేరుకుం టామనేలోపు అలజడి రేపింది. మేఘాల మధ్యలో విమానంలో ఒక్కసారిగా కుదుపు సంభవించింది. లోపల ప్రయాణి కులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే చుట్టూ అల్లకల్లోలం మొదలైంది. కుదుపు కారణంగా సీట్లలో ఉన్నవారంతా పైపైకి ఎగిరిపడుతున్నారు. వస్తువులు ఉండాల్సిన చోట ఉండకుండా జారి పోతున్నాయి. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన ఫ్లైట్ సిబ్బంది విమానాన్ని అత్యవరసరంగా బ్యాంకాక్‌లో ల్యాండ్‌ చేశారు. ఈ సమయంలో విమానమంతా చిందర వందర కాగా సీట్లకు రక్తపు మరకలు అయిన పరిస్థితి. ఎందుకంటే ఆ కుదుపుల్లోనే 73 ఏళ్ల బ్రిటిష్‌ ప్రయాణికుడు మృతి చెందగా.. మరో 30 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో ఇద్దరు ఇండియన్స్‌ కూడా ఉన్నట్టు సమాచారం. ఇక ఈ అలజడికి కారణం 37 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం కేవలం ఐదు నిమిషాల్లోనే 31 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా 6 వేల అడుగులు కిందకు చేరడం. ఈ సమయంలో రికార్డ్‌ అయిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక ఈ ఘటనతో అసలు ఏం జరిగింది..? గాల్లో ఉన్న విమానానికి ఏమైంది..? కుదుపులకు కారణాలేంటనే చర్చ జోరు గా సాగుతోంది. అయితే, ఎయిర్‌ టర్బులెన్స్‌ కారణంగా జరిగింది. అస్థిరంగా ఉన్న గాలి దిశ, వేగంలో గణనీయమైన మార్పు చోటు చేసుకోవడాన్నే ఎయిర్‌ టర్బులెన్స్‌ అంటారు. ఇది విమానాన్ని నెట్టివేయడం లేదా కిందకు తోసేయడం చేయగలదు. చాలా వరకు ఈ పరిస్థితి మేఘాల పైన లేదా కింద ఉన్న గాలి కారణంగా చోటు చేసుకొంటుంది. వీటిల్లో చాలా వరకు స్వల్పంగానే ఉంటాయి. కానీ, క్యుములోనింబస్‌ తుపాను మేఘాల సమీపంలో విమానం ప్రయాణించే సమయంలో ఇవి తీవ్రంగా ఉంటాయి. విమానాలకు ముఖ్యంగా క్లియర్‌ ఎయిర్‌ టర్బులెన్స్‌ అనే పరిస్థితి భయానక అనుభవాలను మిగులుస్తుంది. వాస్తవానికి వీటిని గుర్తించడం చాలా కష్టం. ఆ ప్రాంతంలో మేఘాలు కనిపించవు. ఆకాశంలో సన్నటి మార్గంలో వేగంగా గాలి ప్రయాణించే జెట్‌ స్ట్రీమ్‌ల వద్ద ఈ పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి ఉపరిత లానికి 40 వేల నుంచి 60 వేల అడుగుల ఎత్తులో చోటు చేసుకొంటాయి. సాధారణ మార్గంలో కంటే ఈ జెట్‌ స్ట్రీమ్‌లు ఉన్న చోట్ల గాలి వేగం కనీసం 100 మైళ్లు అధికంగా ఉంటుంది. వీటి కారణంగా చుట్టుపక్కల గాలి అస్థిరమైపోతుంది. విమానాలు ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో తీవ్రమైన కుదుపులకు లోనవుతాయి. ఒక్కో సందర్భంలో ప్రయాణి కులను క్యాబిన్‌లో విసిరికొట్టే ప్రమాదం కూడా ఉంటుంది. సింగపుర్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం ఇటువంటి పరిస్థితిలోనే చిక్కుకొంది. 35వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఐరోపా నుంచి ఉత్తర అమెరికా వైపు ప్రయాణించే మార్గాల్లో ఇలాంటి పరిస్థితులు తరచూ కనిపిస్తుంటాయి. వీటిని తప్పించు కొని విమానాలు ప్రయాణిం చడం దాదాపు అసాధ్యం.

   విమానాలు ఆకాశ వీధిలో జరిగే దారుణమైన టర్బులెన్స్‌లను తట్టుకొనేలా నిర్మిస్తారు. అయితే, అత్యంత అరుదుగా మాత్రమే అవి విమానాలను ధ్వంసం చేయగలుగుతాయి. ఈ నేపథ్యంలో పైలట్లు సాధ్యమైనంత వరకు గాలి అస్థిర ప్రవాహాల్లోకి వెళ్లకుండా చూసుకొంటారు. అవసరమైతే విమానాన్ని నెమ్మదింపచేసి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వీటిలో చిక్కుకుంటే ప్రయాణికు లను సీటు బెల్ట్‌ పెట్టుకోవాల్సిందిగా అలర్ట్‌ చేస్తారు. సిబ్బంది మాట వినకుండా లెక్కచేయని వారు ఆ కుదుపులకు క్యాబిన్‌లో ఏదో మూలకు విసిరేసినట్లు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే, ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా చోటుచేసుకొంటుందట. అమెరికాలోని విమానయాన సంస్థలు 2009-2022 మధ్యలో ఇలాంటి ఘటనలు కేవలం 163 మాత్రమే జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. కానీ వాతావరణ మార్పుల కారణంగా గత పదేళ్లలో ఈ పరిస్థితులు 55శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ అలజడిలో చిక్కుకోకుండా ఉండేందుకు అమెరికా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఎఫ్‌ఏఏ, వైమానిక రంగ వాతావరణ విభాగం టర్బులెన్స్‌ పరిస్థితులకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ముందుగానే పైలట్లను హెచ్చరిస్తాయి. దీనిని బట్టి ప్రయాణ మార్గాలను ప్లాన్‌ చేసుకొంటారు. ఈ టర్బులెన్స్‌ల కారణంగా విమానాల్లో విడిభాగాల అరుగుదల, దెబ్బతింటాయి కాబట్టి వీటికోసం ప్రతి ఏటా 150-200 మిలియన్‌ డాలర్లను ఖర్చు చేస్తుంది. ఇకపోతే విమానాల్లో సీటు బెల్టులను ధరించని వారే ఈ టర్బులెన్స్‌ ప్రమాదాల్లో గాయపడుతున్నట్లు అమెరికాలోని నేషనల్‌ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డ్‌ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షా 50 వేల వైమానిక మార్గాలను అధ్యయం చేసిన టర్బలి అనే వెబ్‌సైట్‌ శాంటి యాగో, చిలీ, విరు మధ్య ప్రయాణించే మార్గంలో టర్బులెన్స్‌లు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఇక కజకిస్థాన్‌లోని అల్మాటి నుంచి కిర్గిస్థాన్‌లోని బిష్కెక్‌ మధ్య గగనతల మార్గం రెండో స్థానంలో ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్