28.2 C
Hyderabad
Friday, March 20, 2026
spot_img

టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. బస్సు ఎక్కే మహిళలకు గిఫ్ట్లు

స్వతంత్ర వెబ్ డెస్క్: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు టీఎస్ ఆర్టీసీ(TS RTC) గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్ట్ 30, 31న బస్సుల్లో ఎక్కే మహిళలకు లక్కీ డ్రా(Lucky Draw) ప్రకటించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు రూ.5.50 లక్షల విలువైన గిఫ్ట్ లు అందజేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆగస్టు 30, 31 తేదీల్లో  బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక మహిళలు తమ టికెట్ వెనకాల పేరు, ఫోన్ నెంబర్  రాసి బస్టాండ్లలో ఏర్పాటు  చేసిన బాక్స్ లలో వేయాలి. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేసింది.

ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వనుంది.  ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు ఆక‌ర్షణీయ‌మైన రూ.5లక్షల50  వేల  విలువగల బ‌హుమ‌తులు అందించనుంది. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని ఆర్టీసీ కోరింది. సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుందని  టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్