TS EdCET Notification |ఉపాధ్యాయుడు కావాలని చాలా మంది తమ లక్ష్యంగా నిర్దేశించుకుంటారు. సమాజంలో ఉపాధ్యాయుడికి గౌరవప్రధమైన స్థానం ఉండటంతో టీచర్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఉపాధ్యాయుడి కొలువు చేయాలంటే దానికి కొన్ని అర్హతలు ఉండాలి. ముఖ్యంగా ఎల్పీసెట్ లేదా డైట్, లేదా బీఈడీ విద్యార్హత ఉండాలి. బీఈడీ చదవాలంటే ముందుగా దానికోసం ఎడ్ సెట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. తెలంగాణలో తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EDCET) 2023 ప్రకటన విడుదలైంది. ఎడ్‌సెట్-2023 దరఖాస్తుల స్వీకరణ మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎడ్‌సెట్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌సీ, ఎస్‌టీ, వికలాంగ అభ్యర్ధులు రూ.500, ఇతరులు రూ.700 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో రెండు సంవత్సరాల BEd రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ తెలంగాణ ఉన్నత విద్యామండలి తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహించనుంది. ఈ ఏడాది మే 18వ తేదీన ఎడ్‌సెట్ రాత పరీక్షను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు.
Read Also: రాత పరీక్ష లేదు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ.. ఈ ఉద్యోగ సమాచారం మీకోసం..
Follow us on: Youtube Instagram