స్వతంత్ర వెబ్ డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి( Ponguleti Srinivasa Reddy) ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్(Thellam Venkatarao) ఈరోజు బీఆర్ఎస్లో(BRS) చేరారు. మంత్రి కేటీఆర్(Minister KTR) సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. నిన్నమొన్నటి వరకు పొంగులేటితో కలిసి నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తెల్లం వెంకట్రావ్.. అంతర్గత విభేదాలతో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.
తెల్లం వెంకట్రావు చేరికతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వెంకట్రావు కాంగ్రెస్ చేశారు. పార్టీలో చేరిన తెల్లం వెంకట్రావ్ భవిష్యత్ కు మాది భరోసా అన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ను(Congress) నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే అని విమర్శించారు. జల్, జంగల్, జమీన్ విషయంలో ఏం జరుగుతుందో అందరు గమనించాలని కోరారు. తెలంగాణలో కోటి ఎకరాల్లో సాగు జరుగుతోందన్నారు. ప్రాజెక్టుల పునరుద్ధరణతో సాగు విస్తీర్ణం పెరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.


