స్వతంత్ర, వెబ్ డెస్క్: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది అక్టోబరులో జరగనున్న వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్ కోసం జట్టులోకి అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. బోర్డు విజ్ఞప్తితో మళ్లీ కివీస్ తరఫున బరిలోకి దిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వన్డే వరల్డ్‌కప్ జట్టులోకి బౌల్ట్‌ను కచ్చితంగా తీసుకోవాలని బోర్డుపై దేశ ప్రజలు ఒత్తిడి తేవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్‌ల్లో పాల్గొనేందుకు.. గతేడాది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు కాంట్రాక్ట్‌ను బౌల్ట్ తిరస్కరించాడు. ఆ దేశం తరఫున మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు(39) పడగొట్టిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
మరోవైపు ఇంగ్లండ్ సీనియర్ ఆటగాడు మొయిన్ అలీ సైతం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు టెస్టులకు ప్రకటించిన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో దాదాపు రెండేళ్ల తర్వాత టెస్ట్‌ల్లో మొయిన్ ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.