స్వతంత్ర వెబ్ డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంగళవారం చిట్యాల మండలం కైలాపూర్‌లో మహిళా కూలీలు మిరప నారు నాటుతుండగా పిడుగు పడింది. పిడుగు ధాటికి మిరప నారు నాటుతున్న వారిలో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందినవారిని సరిత (30), మమత (32)గా గుర్తించారు. ఇదిలా ఉండగా, కాటారం మండంలోని దామెరకుంటలో పిడుగుపాటుకు రాజేశ్వర్ అనే రైతు మృతి చెందాడు. మరో ముగ్గురు కూలీలకు గాయాలు అయ్యాయి. పొలంలో కలుపు తీస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.