జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల బదిలీలు సంచలనం సృష్టించాయి. ఒకేరోజు ఎస్సై ప్రసాద్ సహా ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ , ఆరుగురు కానిస్టేబుల్స్ ను కూడా బదిలీ చేస్తూ ఎస్పీ కిరణ్ ఖరే సంచలన నిర్ణయం తీసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ పోలీస్ట్ స్టేషన్ లో జరిగిన ఘటన ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారింది. మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ జెడ్పిటీసి భర్త “మన్మధుడా” అంటూ చిందులు వేశాడు. అక్కడున్న సిబ్బంది సెల్ ఫోన్ లలో పాటలు పెట్టి మరీ వీడియో రికార్డు చేశారు. దీంతో అది కాస్త వైరల్ గా మారింది. ఘటనపై ప్రజలు పోలీసులపై ఫైర్ అవుతున్నారు.
మంథనిలో కాంగ్రెస్ నాయకులు ఏది చెబితే అదే పనిని పోలీసులు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తు ఆరోప ణలు వస్తు న్నాయి. మంథనిలో కొందరు పోలీసులు తమ ప్రతిష్టను దిగజార్చుకునేలా ప్రవర్తిస్తున్నారం టూ విమర్శిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది. దాంతో ఈ ఘటన ఉన్నతా ధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై సీరియస్ అయిన ఎస్పీ… పోలీస్ స్టేషన్ సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఎస్సై ప్రసాద్ ను క్రమశిక్షణ రాహిత్యం కింద బదిలీ చేశారు.