ప్రముఖ కోలివుడ్ నిర్మాత ఎస్ ఎస్ చక్రవర్తి (53) మృతి చెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోలివుడ్ లో చక్రవర్తి అనేక సినిమాలు చేశారు. ఈ సినిమాల్లో ఎక్కువ సినిమాలను హీరో అజిత్‌తో చేశాడు. అలాగే శింబు నటించిన కాలై, వాలు సినిమాలను కూడా ఆయన నిర్మించారు. కోలీవుడ్‌లో నిర్మాతగా హీరో అజిత్‌తో వాలి, రెడ్, సిటిజెన్, మగవారే, ఆంజనేయ అనే సినిమాలను తెరకెక్కించారు. చక్రవర్తికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చక్రవర్తి ఇకలేరు అన్న వార్తతో షాక్‌కు గురైన కోలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్ లో సంతాపం తెలియజేస్తున్నారు.