గుంటూరు జిల్లాలో తెనాలి నాజర్ పేటలో కిరణా షాపు వ్యాపారి కుటుంబం మొత్తం ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. పురుగుమందు తాగి శంకర్ రావు అనే వ్యాపారి కుటుంబం ఆత్మ హత్యా యత్నం చేసింది. చికిత్స పొందుతూ శివశంకర్ భార్య నాగమణి మృతి చెందింది. తండ్రి, కూతురుకి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యాయత్నానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
అత్తింటి వేధింపులు, అప్పుల బాధతో తమ కుటుంభం ఆత్మహత్యాయత్నం చేసిందని టీ- షాప్ నడుపుతున్న శివశంకర్ రావు తెలిపారు. శివశంకర్ రావు పాల వ్యాపారం సాగకపోవడంతో రైల్వే స్టేషన్ వద్ద టీ స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. కుమార్తె హారికకి తెనాలికి చెందిన ఓ వ్యక్తితో మూడు సంవత్సరాల క్రితం వివాహం చేశారు.. అప్పు చేసి పదిహేను లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసినట్లు శివశంకర్ రావు చెప్పాడు. అయినా సరే అదనపు కట్నం కోసం అల్లుడు కుమార్తెను తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పాడు. ఇప్పటికే తన బిడ్డకు రెండు సార్లు అబార్షన్ చేయించడంతో పాటు తమను తన బిడ్డను మానసికంగా వేదిస్తున్నారని శివశంకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె కాపురం సరిగ్గా లేకపోవడం అప్పుల బాధ ఎక్కువ కావడంతో ముగ్గురం కలిసి ఆత్మహత్యాయత్నం చేశామని బాధితుడు శివశంకర్ వాపోయాడు.


