కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలో నది దాటుతున్న సమయంలో ట్యాంక్ ప్రమాదానికి గురై ఐదుగురు సైనికులు మరణించారు. ట్యాంక్ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా నది దాటుతుండగా ఈ విషాదం చోటుచేసుకుంది.T-72 ట్యాంక్‌లో మందిర్ మోర్హ్ నది దాటుతుండగా ఒక్కసారిగా ప్రవాహ ఉద్ధృతి పెరిగి ఈ ప్రమాదం జరిగినట్టు అధికారు లు తెలిపారు. దౌలత్ బెగ్ ఓల్డీ ప్రాంతంలో భారత సైన్యం నిర్వహించిన విన్యాసాల్లో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నదిని దాటే ట్యాంక్ విన్యాసా లు చేస్తుండగా ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో ఐదుగురు జవాన్లు నదిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పో యారు. మృతుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారి ఉన్నట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.


