స్వతంత్ర వెబ్ డెస్క్: మృత్యువు ఎప్పుడు ఎలా పలకరిస్తుందో అంచనా వెయ్యలేము.. అది మన చేతుల్లో లేని పని.. మొబైల్ ఛార్జర్ పిన్‌ను నోటిలో పెట్టుకుని 8 నెలల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఛార్జర్ ను సాకెట్‌లోకి ప్లగ్ చేసి, స్విచ్ ఆన్ ఉంచారు. అదేసమయంలో పాకూ కుంటూ అటుగా వెళ్లిన చిన్నారి మొబైల్ ఛార్జర్ పిన్ను నోట్లో పెట్టుకుంది. దీంతో చిన్నారి విద్యుదాఘాతానికి గురైంది.
అది గమనించిన పేరెంట్స్ హుటాహుటిన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా, మరణించిందని డాక్టర్లు ప్రకటించారు. దీంతో తమ ముద్దుల కుమార్తెను కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు.. నెలల చిన్నారి కరెంట్ షాక్ తో చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి వాటి గురించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని పోలీసులు హెచ్చరిస్తున్నారు..


