పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్-బీజేపీల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. బీఆర్ఎస్కు తీవ్ర నిరాశే ఎదురయింది. ప్రస్తుతం కాంగ్రెస్ 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు 8 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. ఒక స్థానంలో ఎమ్ఐఎం లీడ్లో ఉన్నాయి. నిజామాబాద్, కరీం నగర్, మహబూబ్నగర్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, ఆదిలాబాద్లో బీజేపీ ఆధిక్యం కనబరు స్తుండగా.. జహీరాబాద్, పెద్దపెల్లి, మహబూబాబాద్, నల్లగొండ, ఖమ్మం, భువనగిరి, వరంగల్, నాగర్ కర్నూల్ స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. హైదరాబాద్లో MIM అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి లీడ్లో కొనసాగుతున్నారు. తెలంగాణలో కూడా బీజేపీ అభ్యర్థులు 8 మంది విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇక అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్ అయినటువంటి మల్కాజ్ గిరిలో BJP అభ్యర్థి ఈటెల రాజేందర్ సుమారు 2 లక్షల 69 వేల 994 ఓట్ల మెజార్టీతో ముందంజలో కొన సాగుతున్నారు ఈటల రాజేందర్. దాంతో ఆయన సంబరాల్లో మునిగిపోయారు. మరోవైపు నిజామా బాద్ పార్లమెంట్ స్థానంలో ధర్మపురి అరవింద్ లక్షా 20 వేల మెజార్టీతో గెలుపొందారు.


